పెట్రోల్ బాటిల్‌తో మరో రైతు హల్‌చల్

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయంలో లంబడిపల్లికి చెందిన రైతు పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేశాడు. తన భూసమస్య పరిష్కరించడం లేదంటూ కనకయ్య అనే రైతు తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్లపై పెట్రోల్ చల్లాడు. ఆ క్రమంలో పెట్రోల్ కార్యలయ సిబ్బంది, అధికారులపై కూడా పడింది. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. అధికారులు తన సమస్యను పరిష్కరించకపోవడంతోనే కనకయ్య ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రైతు కనకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదం కారణంగానే భూమి పట్టా చేయలేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.

Latest Updates