‘రూ.కోట్ల‌లో లంచం.. సీఎంవో అధికారుల‌కు సంబంధం’

Former BJP MLA NVS Prabhakar has said that TS CMO officials were involved in the multi-crore bribery case.

రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం లో ఏ చిన్న పని జరగాలన్న అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని బిజెపి మాజీ ఎమ్మెల్యే NVS ప్రభాకర్ అన్నారు. అందుకు ఉదాహరణే మేడ్చ‌ల్ జిల్లా కీసర మండ‌ల‌ రెవిన్యూ అధికారులు ఏసీబీ కి పట్టుపడడమ‌ని అన్నారు.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, కొంతమంది ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతూ సర్కారు భూములను ప్రైవేటు సంస్థలకు కట్ట బెడుతున్నారని ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించారు. ఏసీబీ కేసుల్లో విచారణ సరిగా జరపడం లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే అవినీతి లో భాగ‌స్వాముల‌వుతున్నారని ఆరోపించారు. రెవిన్యూ ఉద్యోగులు లక్షలు, కోట్ల లో లంచం తీసుకుంటున్నారంటే అందులో సీఎంవో అధికారుల కు సంబంధం ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫీస్ లోని అధికారుల ఆదేశాల మేరకే MRO లకు పోస్టింగ్ లు జ‌రుగుతున్నాయ‌ని..అవినీతి లో సీఎంవో అధికారులకు, TRS లోని నాయకులు పాత్ర ఉందని అన్నారు. ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అవినీతి పై జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణ చేపట్టాలని ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై త్వరలోనే గవర్నర్ ను కలుస్తామ‌ని చెప్పారు.

Former BJP MLA NVS Prabhakar has said that TS CMO officials were involved in the multi-crore bribery case.

Latest Updates