పండగపూట ఆడబిడ్డను ఏడిపించారు.. ఈ పాపం ఊరికే పోదు

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న వెన్నుపోటు పొడిచారన్నారు మాజీ చైర్ పర్సన్ మనీషా. కొడుకు భవిష్యత్ కోసం తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. కొడుకును మున్సిపల్ చైర్మన్ చేయడానికే పక్కా ప్లాన్ ప్రకారం తనను నామినేషన్ విత్ డ్రా చేసుకునే విధంగా చేశారన్నారు. పండగపూట ఆడబిడ్డను ఏడిపించిన పాపం ఊరికే పోదని ఆమె అన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, సస్పెండ్ చేయడానికి పార్టీ ఆయన సొత్తు కాదని అన్నారు. ఏదేమైనా తాను టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, కేసీఆర్ పై తమకు పూర్తి నమ్మకముందని అన్నారు.  కేసీఆర్ పేరు నిలబెట్టేలా పార్టీ కోసం పని చేస్తానని ఆమె అన్నారు.

Latest Updates