రాజ్యసభ ఎంపీగా మాజీ సీజేఐ రంజన్​ గొగోయ్ ప్రమాణం

సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ (గురువారం) రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనల మధ్య గొగోయ్ ప్రమాణ స్వీకారం జరిగింది. గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ కొన్ని రోజుల కిందే రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం గొగోయ్ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేస్తూ..మధ్యలో వాకౌట్ చేశారు.

Latest Updates