ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న షీలా దీక్షిత్‌.. హస్పిటల్ లో  చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 81 సంవత్సరాలు. ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు షీలా దీక్షిత్. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  ఎంపీగా పోటీ చేశారు.

షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు చేశారు. 1998 నుంచి 2013 వరకు ఆమె ముఖ్యమంత్రిగా పని చేశారు. 1938 మార్చి 31న జన్మించిన ఆమె 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. షీలా కేరళ గవర్నర్ గా కూడా పనిచేశారు.

Latest Updates