కరోనాతో ఢిల్లీ మాజీ క్రికెటర్ సంజయ్ కన్నుమూత

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఓ క్రికెటర్ ను బలిగొన్నది. ఢిల్లీ మాజీ క్లబ్ క్రికెటర్ సంజయ్ దోబల్ (53) వైరస్ బారిన పడి సోమవారం మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. దోబల్ పెద్ద కుమారుడు సిద్ధాంత్ .. రాజస్థాన్ కు ఆడుతుం డగా, చిన్న కుమారుడు ఎకాన్ష్​ ఢిల్లీ అండర్ –23 టీమ్​ తరఫున అరంగేట్రం చేశాడు. దోబల్ ఢిల్లీ అండర్ –23 టీమ్​కు సపోర్ట్​ స్టాఫ్​గా కూడా పని చేశాడు. దీర్ఘ కాల వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న దోబల్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దోబల్ కు ప్లాస్మా చికిత్స చేయించడం కోసం గంభీర్ చాలా ప్రయత్నా-లు చేశాడు. చివరకు ఓ వ్యక్తి ప్లాస్మా దానం చేసినా ప్రయోజనం లేకపోయింది.