వడ్లు అమ్మడానికి వెళ్లిన రైతు వడదెబ్బతో మృతి

పాపం రైతు.. వడ్లు అమ్మడానికి వెళ్లి వడదెబ్బతో చనిపోయాడు

కామారెడ్డి జిల్లాలో ఎండలు తాళలేక ఓ రైతు చనిపోయాడు. ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామానికి చెందిన గోపాల్ లక్ష్మపూర్ లో వరి కొనుగోలు కేంద్రం దగ్గర ధాన్యం అమ్మేందుకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. ఆరోజు చీకటి పడడంతో మరుసటి రోజు కాంట పెడతామనడంతో…మిగితా రైతులతో కలిసి ధాన్యం దగ్గరే పడుకున్నాడు. తెల్లవారుజామున మిగితా రైతులు… లేపేందుకు ప్రయత్నంచడంతో చనిపోయి ఉన్నాడు. మృతుడికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Latest Updates