గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కన్నుమూత

అహ్మదాబాద్: గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ (92) చనిపోయారు. బీజేపీ సీనియర్ నేత అయిన కేశూభాయ్ గుజరాత్‌‌కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. గురువారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అహ్మదాబాద్‌‌లోని ఓ ఆస్పత్రిలో కేశూభాయ్‌‌ను చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాసను విడిచారు. జాతీయ మీడియా ప్రకారం.. కేశూభాయ్‌‌కు సెప్టెంబర్‌‌లో కరోనా సోకిందని సమాచారం. ఆయనకు అసింప్టోమేటిక్ కరోనాగా తెలుస్తోంది.

Latest Updates