కోలుకుంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్ కోలుకుంటున్నారు.నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్‌ హార్ట్ ఆసుప‌త్రికి తరలించగా.. డాక్టర్లు ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని, రెండు మూడురోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు డాక్టర్‌ అతుల్‌ మాథూర్‌. తమ అభిమాన ఆటగాడు‌ త్వరగా కోలుకుని, క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హర్యానా హరికేన్‌ శనివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, క్షేమంగా ఉన్నానని తెలిపారు. క‌పిల్ థంబ్స‌ప్ సింబ‌ల్ చూపిస్తూ.. ఆస్పత్రిలో  కూతురితో ఉన్న ఫొటోని షేర్ చేశారు.

Latest Updates