మాజీ స్పిన్నర్‌ చంద్రశేఖర్‌కు హార్ట్‌ స్ట్రోక్‌

బెంగళూరు: టీమిండియా మాజీ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ బీఎస్‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌.. హార్ట్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌కు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. శుక్రవారం సాయంత్రం బాగా అలసిపోయినట్లు కనిపించిన చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌.. తడబడుతూ మాట్లాడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని క్రికెటర్‌‌‌‌‌‌‌‌ భార్య సంధ్య చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. ‘అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్‌‌‌‌‌‌‌‌లో చిన్న బ్లాకేజ్‌‌‌‌‌‌‌‌ ఉందని చెప్పారు. దాని ఫలితంగానే మైల్డ్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తర్వాత చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ బాగా రికవర్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ వార్డ్‌‌‌‌‌‌‌‌కు తరలించి ఫిజియోథెరపీ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ అవుతాడు’ అని సంధ్య పేర్కొంది.

Latest Updates