మనీ ల్యాండరింగ్ కేసు : మాజీ మంత్రికి ఏడేళ్ల జైలు శిక్ష..2కోట్ల జరిమానా

మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ మాజీ మంత్రి ఎక్కా అనోశ్  కు రాంచీ  ప్రత్యేక కోర్టు ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శిక్షను ప్రకటించిన కోర్ట్ స్పెషల్ జడ్జి అనిల్ కుమార్ మిశ్రా..జైలు శిక్షతో పాటు 2 కోట్ల జరిమానా విధించారు.  జరిమానా కట్టకపోతే మరో సంవత్సరం జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

ఆనోష్ నాటి  ముఖ్యమంత్రి మధు కోడా మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మార్చి 2005 నుండి 2008 డిసెంబర్ వరకు పనిచేశారు. ఆ సమయంలో సుమారు 3220.32 కోట్ల మనీ లాండరింగ్‌ లో అతని పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో  స్టేట్ విజిలెన్స్ బ్యూరో నవంబర్ 2008 లో ఆనోష్ తో పాటు 2009 మరో రాష్ట్ర మంత్రి హరి నారాయణ్ రాయ్ పై 2009లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.  ఈ కేసు ఆధారంగా, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడి దర్యాప్తు ప్రారంభించింది. జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులతో సీబీఐ ఈ కేసును స్వీకరించి 2012 జనవరిలో మరో చార్జిషీట్ దాఖలు చేసింది,

రూ. 8216.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. 2017లో రాయ్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తాజాగా రాయ్‌కు జనవరి 2017 లో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.

Latest Updates