సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కన్నుమాత

బెంగుళూరు: కర్నాటక మాజీ లోకాయుక్త, సుప్రీం న్యాయమూర్తి ఎన్.వెంకటాచల(90) బుధవారం ఉదయం కన్నుమూశారు. బెంగుళూరులోని తన ఇంట్లో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.  కుమారుడు ఓ సీనియర్ అడ్వకేట్.

జూలై 3, 1930 న, కోలార్ జిల్లాలోని ములాబగల్ తాలూకాలోని మిత్తూరు గ్రామంలో వెంకటచల జన్మించారు.  మైసూర్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ మరియు బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీలను పొందిన ఆయన.. 1955 న అప్పటి హైకోర్టు మైసూర్‌లో న్యాయవాదిగా పనిచేశాడు. 1968 లో హైకోర్టు ప్రభుత్వ అభ్యర్ధిగా ఎన్నికై, 1973 వరకు ఆ పదవిలో కొనసాగాడు. 1977లో హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా పదోన్నతి పొందాడు. 2001 లో కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తిగా పనిచేశారు.

Former Karnataka Lokayukta and former Supreme Court Judge, N Venkatachala passed away in Bengaluru

Latest Updates