మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలంగేకర్ ఇవాళ(బుధవారం) కన్నుమూశారు. 91 ఏళ్ల శివాజీరావు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. గత నెలలో కరోనా బారినపడిన ఆయన పూణెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో  చికిత్స పొందారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని ఫలితాలు రావడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే .. కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా ఆయన చనిపోయినట్లు శివాజీరావు కుటుంబ సన్నిహితులు తెలిపారు.

Latest Updates