మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌‌కు కరోనా

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌కు కరోనా సోకింది. తనకు కరో్నా పాజిటివ్‌‌గా తేలిందని, ఐసోలేషన్‌‌లో ఉంటున్నట్లు ఫడ్నవీస్ శనివారం తెలిపారు. బిహార్‌‌ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌‌చార్జ్‌‌గా ఫడ్నవీస్ వ్యవహరిస్తున్నారు. ‘నేను కొంతసేపు ఆగి విశ్రాంతి తీసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. లాక్‌‌డౌన్ మొదలైనప్పటి నుంచి దాదాపుగా ప్రతి రోజు నేను పని చేస్తున్నా. కానీ ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలని దేవుడు భావించినట్లున్నాడు. నాకు కరోనా పాజిటివ్‌‌గా తేలింది. నేను ఐసోలేషన్‌‌‌లో ఉంటున్నా. డాక్టర్ల సూచనల మేరకు ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్నా’ అని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. తనతోపాటు కాంటాక్ట్‌‌లోకి వచ్చిన వారు టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరారు.

Latest Updates