బాత్ రూమ్ లకు తండ్రి కొడుకుల ఫోటోలు పెట్టుకొని మురిసి పోతుండ్రు

రాజేంద్ర నగర్: గ్రేటర్ హైదరాబాద్‌‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ అన్నారు. రాజేంద్ర నగర్ డివిజన్ (60)లో జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు మోహన్.. బీజేపీ అభ్యర్థి అర్చనా జయప్రకాశ్‌‌కు ఓటేయాలని కోరారు. గతంలో టీడీపీకి, టీఆర్ఎస్‌‌కు అవకాశం ఇచ్చారని ఈసారి బీజేపీ ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాత్ రూమ్‌‌లకు తండ్రీ కొడుకులు తమ ఫొటోలు పెట్టుకొని మురిసి పోతున్నారని సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌లను విమర్శించారు. దుబ్బాకలో ఓడిపోతే టీఆర్ఎస్‌‌కు జ్వరం పట్టుకుందన్నారు. రాజేంద్రనగర్ డివిజన్ అభ్యర్థి విద్యావంతురాలని, మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థి అని బాబు మోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Latest Updates