అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

హైద‌రాబాద్: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తే అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా ప‌రిపాలన జరగాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్ర‌శ్నించారు.

పోలీసులు అక్రమ అరెస్ట్ లు చేయడం చూస్తుంటే మనం ఇంకా నిజాం పరిపాలనలో ఉన్నామా అని పిస్తుందని అన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో నయా రజాకార్ల పరిపాలన అంతమయ్యేరోజులు దగ్గర పడ్డాయని అన్నారు.

 

Latest Updates