బిడ్డను ఎమ్మెల్సీ చేసినవ్​.. నిరుద్యోగులను పట్టించుకోవా?

  • మోత్కుపల్లి నర్సింలు, ​రఘునందన్​రావ్​

మెదక్/చేగుంట, వెలుగు: ఒక్క ఏడాది బిడ్డకు పదవి లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఎమ్మెల్సీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​  నిరుద్యోగుల గురించి మాత్రం ఆలోచించడం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు, దుబ్బాక ఉప ఎన్నికల బీజేపీ క్యాండిడేట్​ రఘునందన్ రావ్ అన్నారు. శనివారం చేగుంట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది సుజాత రఘుపతి, రాష్ట్ర యోగ, ఫెన్సింగ్ కోచ్ కరణం గణేష్ రవికుమార్, రెడ్డిపల్లి ఎంపీటీసీ శంభుని రవి వారి అనుచరులతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ మంత్రి హరీశ్​రావ్​ చేగుంటకు శాంక్షన్​ అయిన ఈఎస్సై హాస్పిటల్​ను సీఎం నియోజకవర్గంలోని మనోహరాబాద్ కు, డిగ్రీ కాలేజ్ సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు వచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Latest Updates