నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత

మాజీ మంత్రి, TRS దివంగత నేత  నాయిని నర్సింహారెడ్డి  భార్య అహల్య(68) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందారు.  ‌ఇటీవల నాయిని, ఆయన భార్య అహల్య కరోనా బారిన పడ్డారు. దీంతో ఇద్దరు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆమెకు కరోనా నెగటీవ్‌ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త నాయిని నర్సింహ రెడ్డి మృతితో ఆఖరి చూపుకు అహల్యను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు.

ఈ నెల 22వ తేదీన కరోనాతో కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో కన్నుమూశారు నాయిని నర్సింహా రెడ్డి.

Latest Updates