షాద్‌న‌గ‌ర్ జంట హ‌త్యల కేసు: మాజీ మంత్రికి క్లీన్ చిట్

former-minister-rama-subba-reddy-got-clean-chit-from-shadnagar-twin-murders-case

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఊరట

షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఊరట లభించింది. ఈ కేసును కోట్టి వేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ బస్టాండ్‌లో 1990 డిసెంబర్ 6న కడప జిల్లా, జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పెద్దనాన్న దేవగుడి శివశంకర్ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్ రెడ్డిలను ప్రత్యర్థులు హత్య చేశారు. దీనికి  సంబంధించి మాజీ మంత్రి శివారెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు, టీడీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి, ఆయన సమీప బంధువు విశ్వేశ్వర రెడ్డి, సుగమంచిపల్లె వెంకట్రామిరెడ్డి, ఆయన ముగ్గురు సోదరులు సహా మొత్తం11 మందిపై షాద్‌నగర్ పోలీసులు కేసు పెట్టారు.

2006లో కేసును కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ  శంకర్ రెడ్డి కుమారుడు శివనారాయణ రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. నిందితులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పీల్ చేసినప్పటికీ, కేసు విచారణ ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడంతో 29 ఏళ్ల నాటి జమ్మలమడుగు (ఏపీలోని కడప జిల్లా) జంట హత్యల కేసు ఉత్కంఠకు తెర పడింది.

Latest Updates