మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాంబాబు మృతి

ఆంధ్రప్రదేశ్ జిల్లా గుంటూరు పశ్చిమ  నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే.. 72 ఏళ్ల చదలవాడ జయరాంబాబు అనారోగ్యంతో మృతి చెందారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 1985, 1994 లలో చదలవాడ రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. చివరి వరకు ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు

చదలవాడ జయరాంబాబుకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రేపు మధ్యాహ్నం గుంటూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జయరాంబాబు మృతి విషయం తెలిసి నేతలు …ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Latest Updates