మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్‌ఫ్రే కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నామినేటెడ్‌ మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్‌ఫ్రే(62) ఈ ఉదయం(మంగళవారం) కన్నుమూశారు. ఆరు రోజుల క్రితం ఆమె గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీ అసెంబ్లీకి రెండు సార్లు ఎమ్మెల్యేగా నామినేట్‌ అయ్యారు. ఆమె మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. హైదరాబాద్ గన్‌ఫౌండ్రిలో సెయింట్‌ జోసఫ్‌ క్యాథడ్రిల్‌లో రేపు(బుధవారం) మధ్యాహ్నం 4 గంటలకు సామూహిక ప్రార్ధనలు నిర్వహించనున్నారు.

 

Latest Updates