కావేటి తిరుగుబాటు

కేసీఆర్ నే కార్మికుల సంక్షేమం సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ! ఆసిఫాబాద్, వెలుగు: మరో నెల రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు అసమ్మతి బెడద తప్పేలా లేదు . ఆసిఫాబాద్‌ జిల్లా లో అసంతృప్తి నాయకులు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. జిల్లా లోని ఆసిఫాబాద్‌, సిర్పూ ర్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కోనేరు కోనప్పను బరిలో ఉండగా.. ఆయా నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశిం చిన సీనియర్‌ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిర్పూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్పకు వ్యతిరేకంగా.. అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమయ్య ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పడం ఆ పార్టీని కలవర పెడుతోంది. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రావి శ్రీనివాస్‌, పాల్వాయి పురుషోత్తంరావు మహాకూటమి నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్‌ దక్కినా మరొకరు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందు కు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అస్మమతి బెడద నేపథ్యం లో చివరి క్షణాల్లో ఏ పార్టీ లాభం పొందు తుందో తెలియకుండా పోయింది. ఆసిఫాబాద్‌లో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత ఆత్మ రామ్ నాయక్ బీజేపీలో చేరి..టికెట్‌ సాధించగా.. మహాకూటమిలో కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.

Latest Updates