ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ ఎమ్మెల్యే రూ.25 లక్షల విరాళం

హైద‌రాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయ‌న అందించారు .

నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాసాయిపేట గ్రామ ప్రజలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును నర్సాపూర్ ఎమ్మెల్యే చినుముల మధన్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ప్రగతిభవన్ లో అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ జిల్లా ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Latest Updates