ఎవరేమైనా సరే.. కేసీఆర్ కు అధికారం కావాలి

రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ కు అహంకారం పెరిగిందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి. పెద్దపల్లిలో ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడిన వివేక్ .. దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా కేసీఆర్ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు రాష్ట్రానికి మంచివి కావన్నారు. ఎవరు ఏమైనా కేసీఆర్ కు మాత్రం అధికారం, సీఎం సీటు కావాలని అన్నారు . కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమని..ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. హైకోర్టులో తప్పుడు అఫిడవిట్ లు దాఖలు చేస్తున్న అధికారులను ప్రాసిక్యూట్ చేయాలన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల రాష్ట్రంగా మారుస్తున్నారన్నారు.

Latest Updates