బడ్జెట్ లో ఆ మూడు హామీలపై ప్రస్తావన ఏది.?

former pcc president ponnala lakshmaiah questions on telangana budget 2020

ఢిల్లీ: ఓట్లు అడిగే ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి…..ఇప్పుడు ఇవ్వలేమంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను TRS మోసం చేస్తుందని అన్నారు మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ పూర్తిగా అవాస్తవ బడ్జెట్ అని, ఆర్థిక మాంద్యం అంటూ అసెంబ్లీలో  అవాస్తవ బడ్జెట్ ని ప్రవేశ పెట్టారన్నారు. గత బడ్జెట్ తో పోలిస్తే….ఈ సారి బడ్జెట్ ని తగ్గించారని చెప్పారు.

2014 లో ఎన్నికల ముందు ఇచ్చిన మూడు ప్రధాన హామీలు బడ్జెట్ లో ప్రస్తావనకు రాలేదన్నారు పొన్నాల.  దళితులకు మూడు ఎకరాల భూమి గురించి కానీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి కానీ, నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో ఎక్కడ కూడా ప్రస్తావించలేదన్నారు.

బడ్జెట్ ప్రసంగంలో లో 2 లక్షల ఇల్లు ఇచ్చామని అధికార నేతలు అబద్దం చెబుతున్నారన్నారు. పేదలకు కొన్ని వేల ఎకరాలు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే ఉందని అన్నారు పొన్నాల. రాజ్యాంగ పరంగా గిరిజనులు కు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తూ టీఆర్ఎస్ నేతలు కాలయాపన చేస్తున్నారన్నారు. తాము అడిగే ప్రశ్నలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై  ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు.

former pcc president ponnala lakshmaiah questions on telangana budget 2020

Latest Updates