NRC లిస్టులో మాజీ రాష్ట్రపతి కుటుంబీకుల పేర్లు మిస్సింగ్

భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ కుటుంబసభ్యులు నలుగురి పేర్లు అస్సాం జాతీయ పౌర గుర్తింపు జాబితాలో నమోదుకాలేదు. అస్సాంలో ఆగస్ట్ 31న జాతీయ పౌర గుర్తింపు జాబితా ఫైనల్ లిస్ట్ విడుదలైంది. గతేడాది విడుదలైన డ్రాఫ్ట్ జాబితాలో… భారత మాజీ రాష్ట్రపతి కుటుంబసభ్యుల పేర్లు నమోదుకాలేదు. సవరించిన తుదిజాబితాలోనూ వాళ్ల పేర్లు కనిపించలేదు.

ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ భారత ఐదో రాష్ట్రపతిగా 1974 నుంచి 1977 మధ్య పనిచేశారు. ఫక్రుద్దీన్ ఆలీ సోదరుడి కొడుకు నలుగురు కుటుంబసభ్యుల పేర్లు NRC ఫైనల్ లిస్టులో నమోదుకాలేదు. అస్సాంలోని కామరూప్ లో ఉండే ఎస్ఏ అహ్మద్ దీనిపై స్పందించారు. “మేం అధికారులను కలుస్తాం. మా నలుగురి కుటుంబసభ్యుల పేర్లు ఎన్నార్సీలో నమోదుకాలేదు. సెప్టెంబర్ 7 తర్వాత అధికారులను కలవబోతున్నాం. లిస్టులో మా పేర్లు చేర్చాలని కోరతాం” అని ఎస్ఏ అహ్మద్ అన్నారు.

Latest Updates