రైతులకు ఇంతకంటే ఏం ఇవ్వగలను..పద్మ విభూషణ్ వెనక్కి ఇచ్చిన మాజీ సీఎం

పంజాబ్ మాజీ సీఎం శిరోమణి అకాలీదశ్ పార్టీ నేత ప్రకాష్ సింగ్ బాదల్ రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. భారత ప్రభుత్వం తనకు బహుకరించిన పద్మవిభూషణ్ అవార్డ్ ను వెనక్కి తిరిగి ఇస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.  రైతుల ఆందోళనల మధ్య వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులకు మద్దతు పలుకుతూ తన పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ప్రకాష్ సింగ్ బాదల్.., రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. రైతుల పట్లు ప్రభుత్వానికి కనికరం లేదు. రైతుల వల్లే నేను ఇలా ఉన్నా. రైతులను అగౌరపరుస్తూ, అలాంటి వారు ఇచ్చిన గౌరవాలను తీసుకోవటంలో అర్థం లేదు. అందుకే వారికి మద్దతుగా కేంద్రం బహుకరించిన పద్మవిభూషణ్ అవార్డ్ ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు రైతులకు సంబంధించిన ఆర్డినెన్సులు, సంబంధిత బిల్లుల్ని అమలు చేసే సమయంలో రైతుల భయాల్ని, ఆందోళనల్ని పరిష్కరించాలని, కేంద్రం అండగా ఉంటుందని రైతులకు చెప్పాను. కానీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని పంజాబ్ మాజీ సీఎం శిరోమణి అకాలీదశ్ పార్టీ నేత ప్రకాష్ సింగ్ బాదల్ రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates