పెన్షన్ డబ్బుల కోసం.. కుటుంబసభ్యులే ముక్కలుగా నరికేశారు

  • మౌలాలీ రైల్వే మాజీ ఉద్యోగి హత్య కేసు
  • భార్య, కొడుకు, కుమార్తెలే నిందితులు
  • పరారీలో మృతుడి కొడుకు
  • ఎల్బీ నగర్ డీసీపీ వెల్లడి

మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో లో సంచలనం సృష్టించిన రైల్వే మాజీ ఉద్యోగి కిషన్ మారుతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కిషన్ మారుతి భార్య, అతని కొడుకు,కూతురే ఈ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. పెన్షన్ డబ్బుల కోసమే హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని ఎల్ బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపారు

ఈ హత్యోదంతంపై డీసీపీ సంప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. 5 రోజుల క్రితం మౌలాలీలోని ఆర్టీసీ కాలనీ లో కిషన్ మారుతి హత్యకు గురయ్యాడని, తన తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి,  బకెట్లో దాచి పెట్టి అతని కొడుకు పరారయ్యాడని తెలిపారు.ఈ నెల 15న మత్తు మందు ఇచ్చి అతన్ని హత్య చేసినట్టుగా డీసీపీ వెల్లడించారు. ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఈ దారుణం బయటపడింది.

Latest Updates