యూపీలో శివసేన లీడర్ మర్డర్

రాంపూర్ : యూపీలోని రాంపూర్ లో శివసేన లీడర్ అనురాగ్ శర్మ (40) ని ఘోరంగా చంపేశారు. జ్వాలా నగర్ లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఆయనపై కాల్పులు జరిపారు. బండిపై ఇంటికి వెళ్తున్న అనురాగ్ శర్మ ను ఫాలో చేసి ఆటాక్ చేసి పారిపోయారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా ట్రీట్ మెంట్ ఇస్తుండగానే చనిపోయారు. హాస్పిటల్ లోజాయిన్ చేసేందుకు తీసుకొచ్చినప్పుడు డాక్టర్లు లేరంటూ అనురాగ్ శర్మ కుటుంబ సభ్యులు హాస్పిటల్ పై దాడి చేశారు. పోలీసులు వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశారు. అనురాగ్ శర్మ రాంపూర్ జిల్లా శివసేన కన్వీనర్ గా గతంలో పనిచేశారు. ఆయన భార్య బీజేపీ లో కొనసాగుతున్నారు. మృతుడి పై మర్డర్, దోపిడీ కేసులున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రత్యర్థులే అతన్ని మర్డర్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకున్నారు.

Latest Updates