కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్ కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి రషీద్‌ మసూద్‌ (73) ఇవాళ(సోమవారం) మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో రూర్కిలోని ఓ నర్సింగ్‌హోంలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మసూద్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ తెలిపారు. రషీద్‌ మసూద్‌ 5సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.  1889లో జనతాదళ్‌ తరఫున లోక్ సభకు ఎన్నికైన మసూద్‌ అప్పటి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా  పనిచేశారు.

అయితే రషీద్‌ మసూద్‌కు గతంలో కరోనా వైరస్ సోకడంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చేర్పించామని… ఆయన ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత షహ్రాన్‌పూర్‌కు తిరిగి తీసుకొచ్చామని చెప్పారు ఇమ్రాన్. కొంతకాలం భాగానే ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఇటీవల మళ్లీ విషమంగా మారడంతో రూర్కీలోని నర్సింగ్‌హోంలో చేర్పించామని  తెలిపారు.

Latest Updates