జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

ఆఫ్రికా దేశమైన జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే శకం ముగిసింది. 1980 నుంచి 2017 వరకూ సుదీర్ఘ కాలం జింబాబ్వేకు అధ్యక్షుడిగా పనిచేసిన 95 ఏళ్ల రాబర్ట్ ముగాబే ఇవాళ(శుక్రవారం) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముగాబే సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మంగగ్వా ప్రకటించారు. 1924, ఫిబ్రవరి 21న ముగాబే బ్రిటిష్ పాలనలోని రొడీషియా(ప్రస్తుత జింబాబ్వే)లో జన్మించారు.

జింబాబ్వేకు స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఆ దేశానికి చెందిన తొలితరం నాయకుడు ముగాబే. 1980లో మొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1987లో దేశ అధ్యక్ష పగ్గాలను కూడా స్వీకరించారు. జింబాబ్వే జాతిపితగా, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడిగా ముగాబే కీర్తి పొందారు.

ముగాబే మూడు దశాబ్ధాల సుదీర్ఘ పాలనకు 2017 నవంబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా తెరపడింది.