ఫార్ములా-1 లెజెండ్ కన్నుమూత

ఫార్ములా-1 మాజీ ఛాంపియన్ 70 ఎళ్ల నికీ లాడా కన్నుమూశారు. 9 నెలల క్రితం ఊపిరితిత్తుల మార్పిడి ఆఫరేషన్ చేయించుకున్నారు. కొంత కాలం బాగానే ఉన్నా.. ఆ తర్వాత అనారోగ్యంతో …సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1949లో ఆస్ట్రియాలో జన్మించిన నికీ.. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఫార్ములా వన్‌ రేసింగ్‌ను తన కేరీర్‌గా ఎంచుకున్నారు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నికీ.. 1975, 1977, 1984లో టైటిల్స్‌ సొంతం చేసుకున్నారు. 1976లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన తోటి రేసర్ల సాయంతో తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. అయినా కేవలం ఆరువారాల్లోనే కోలుకొని తిరిగి రేసింగ్‌లో పాల్గొని అప్పట్లో సంచలం సృష్టించారు. అంతేకాక నికీ లాడా పలు రేసింగ్‌ బోర్డుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. లాడా ఎయిర్‌, నికీ, లాడామోషన్‌ అనే మూడు ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ను కూడా ప్రారంభించారు.

Latest Updates