మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి నలుగురు విద్యార్ధులు అదృశ్యం

కరీంనగర్ జిల్లాలో నలుగురు విద్యార్ధులు అదృశ్యమవ్వడం కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీందేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన షకీల్,అఖ్తర్,రఫీ, ఇజ్రాయిల్ లు హుజూరాబాద్ పట్టణం లోనీ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.  ఈ నేపథ్యంలో రెసిడెన్షియల్ స్కూల్ నుంచి నలుగురు విద్యార్ధులు అదృశ్యమయ్యారు. ఉదయం విద్యార్ధులు కనిపించపోవడంతో  స్కూల్ యాజమాన్యం విద్యార్ధుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యాజమాన్యం సమాచారంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల అదృశ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates