డమ్మీ తుపాకులతో బెదిరిస్తున్న నలుగురు అరెస్ట్

హైదరాబాద్ : ఆర్ సి పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఆర్మీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. నాగరాజు రఘువర్మ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడని.. ఇతనితో పాటు రాజేష్, రామకృష్ణ, జోరె సింగ్ నలుగురు కలిసి డమ్మీ తుపాకులతో బెదిరించి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు సీపీ. హఫీజ్ పేట్ లో ఆర్మీ అధికారిలాగా వెళ్లి, ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్ ను కూడా ప్రారంభించాడని చెప్పారు.

2017లో నాగరాజు రఘవర్మ ఆర్మీ రిక్రూట్మెంట్ రన్నింగ్ లో పాల్గొన్నాడు కానీ సెలెక్ట్ కాలేదన్నారు. ఈ నలుగురిపై ఆర్సీపురం, పంజాగుట్ట సనత్ నగర్, పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపారు. వీరి వద్ద నుండి రెండు ఆర్మీ యూనిఫామ్, మూడు డమ్మీ తుపాకులు,4 ఫెక్ ఆర్మీ ఐడి కార్డులు, హాండ్ కప్స్, నకిలీ సర్టిఫికెట్స్, స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సీపీ సజ్జనార్.

Latest Updates