అరుదైన ప్రసవం : ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. హైదరాబాద్ లోని చిలుకలగూడ గీతా నర్సింగ్ హోంలో హేమలత, లక్ష్మణ్ దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. ఇందులో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఏప్రిల్ 2న ఈ డెలివరీ జరిగినట్టు హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఒకేసారి నలుగురు పిల్లలు కడుపులో ఉండటంతో.. ఏడున్నర నెలలకే డెలివరీ అయిందని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి కాన్పుని ‘క్వాడ్రుప్లెట్స్’ అంటారని… ఇది అరుదైన ప్రసవాల్లో ఇదీ ఒకటని ఆయన అన్నారు. 8 లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని తెలిపారు.

నెలలు నిండకుండా పుట్టడంతో పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని… దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ విద్యానగర్ లోని నియో బీబీసీ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల్లో ఇద్దరు 1.3, మరో ఇద్దరు 1.4 కిలోల బరువు ఉన్నారని  డాక్టర్లు తెలిపారు. బీబీసీ హాస్పిటల్ కు చెందిన డాక్టర్.ఎన్.ఎల్.శ్రీదర్ మాట్లాడుతూ.. పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. వీరికి స్పెషల్ ట్రీట్ మెంట్ అందించామని.. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని తెలిపారు.

Latest Updates