వీడియో వైరల్: తాడాట ఇలా కూడా ఆడొచ్చా?

న్యూఢిల్లీ: తాడాట (స్కిప్పింగ్) అందరికీ తెలిసిన వ్యాయామమే. చిన్నప్పుడు అందరూ స్కిప్పింగ్ ఆడే ఉంటారు. అయితే ఒక్కరు లేదా ఇద్దరు స్కిప్పింగ్ చేయడం చూసుంటారు. కానీ ఈ వీడియోలో ఒకేసారి నలుగురు స్కిప్పింగ్ చేశారు. దీంట్లో పెద్ద విశేషం ఏముందంటారా.. భుజాలపై ఒక వ్యక్తిని ఎక్కించుకొని పిరమిడ్ వీల్ ఫ్రీస్టయిల్ జంప్ రోప్ చేయడం విశేషం. అలాగే వాళ్లు కింద దిగాక డిఫరెంట్ స్టయిల్‌‌లో జంపింగ్ చేస్తూ ఒకేసారి స్కిప్పింగ్ చేయడం ఆకట్టుకుంటోంది. ఈ జంప్ రోప్ ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు సంవత్సరాల పరిశ్రమతో ఇది సాధ్యమైందని వీడియోలో ఉన్న జొరావర్ సింగ్ చెప్పాడు. అమేజింగ్ ఫీట్ అని, నమ్మలేని విధంగా ఉందంటూ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాడాట ప్రియులు, ఫిట్‌‌నెస్ ఫ్రీక్స్‌‌ ఈ వీడియోను చూసేయండి మరి.

Latest Updates