నలుగురు ఐసిస్ టెర్రరిస్టులు హతం

లాహోర్​: పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నలుగురు ఐసిస్ టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. స్థానిక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి ఆపరేషన్ ప్రారంభించినట్లు పాకిస్తాన్ పంజాబ్ పోలీసుల కౌంటర్ టెర్రరిజం విభాగం(సిటిడి) ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఏడుగురు ఐసిస్ టెర్రరిస్టులు పేలుడు పదార్థాలు, భారీ ఆయుధాలతో అజామ్ చౌక్ బహవాల్పూర్ సమీపంలోని జాఖిరా అడవిలో దాక్కున్నారు. వాళ్ల ప్లాన్​ను పసిగట్టిన ముల్తాన్ సీటీడీ టీమ్ శనివారం రాత్రి దాడి చేసింది. చనిపోయిన వారు అమన్ ఉల్లా, అబ్దుల్ జబర్, రెహమాన్ అలీ, అలీమ్​లుగా గుర్తించారు. తప్పించుకున్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నామని, స్పాట్​ నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Latest Updates