పాక్ మసీదులో పేలుడు..నలుగురు మృతి

పాకిస్థాన్‌ :  పాక్ లో మరోసారి బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బలూచిస్థాన్‌ ..క్వెట్టా దగ్గరలోని కుచ్లక్‌ ప్రాంతంలో ఉన్న మసీదును టార్గెట్ గా పేలుడు జరిపారు. ఈ దుర్ఘటనలో నలుగురు చనిపోగా.. 15మందికి పైగా గాయపడ్డారు. వారిని హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. పేలుళ్లకు పాల్పడినవారి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బలూచిస్థాన్‌ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వరుస దాడులతో బెంబేలెత్తిస్తున్నారు. జూలై  నెలలో పోలీస్ వాహనంపై  బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో 38 మంది పౌరులు గాయపడ్డారు.

Latest Updates