విషాదం.. ఒకరిని కాపాడబోయి నలుగురు మృతి

మహబూబాబాద్ జిల్లా ఆమన్ గల్ లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. బట్టలు ఆరేస్తుండగా సతయ్య అనే వ్యక్తి  విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ఆయనను కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు కూడా కరెంట్ షాక్ కు గురై చనిపోయారు. మృతులు  సత్తయ్య(45),రాధమ్మ(40) అనే ఇద్దరు దంపతులు కాగా.. లింగయ్య(46), లక్ష్మీ(42)మరో ఇద్దరు దంపతులుగా గుర్తించారు. ఒకేసారి రెండు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పీసీసీ బీసీలకే ఇవ్వాలి..సోనియాగాంధీ తెలంగాణకు దేవత

Latest Updates