ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌… నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బస్తర్‌ అటవీ ప్రాంతం భీమాపురంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇవాళ తెల్లవారు జామున మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా… దాదాపు 15 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలం నుంచి రెండు 303 తుపాకులు, భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. సుక్మాలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

 

Latest Updates