బీహార్ కాల్పుల్లో నలుగురు మావోలు హతం

బీహార్ లో  పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్‌ హతమయ్యారు. పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్‌ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం ఉదయం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సల్స్‌.. పోలీసుల పైకి కాల్పులు జరిపారు. అలర్టైన పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు నక్సలైట్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఆపరేషన్‌లో బీహార్‌ పోలీసులతో పాలు సశస్త్ర సీమా బల్‌(SSB), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(STF) బలగాలు పాల్గొన్నాయి. ఘటనా స్థలంలో మూడు లేటెస్ట్ వెపన్స్, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Latest Updates