పూణెలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

మహారాష్ట్రలోని పూణెలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని సుఖ్‌సాగర్‌కు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలకు ఉరివేసిన తర్వాత వారు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ(శుక్రవారం) ఉదయం వారు నలుగురు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Latest Updates