గుంతలో పడిన కారు.. నలుగురు మృతి

కర్ణాటక: మైసూరు జిల్లా మద్యాంగళ ప్రాంతంలో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో  నలుగురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు జాతీయ రహదారి పై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి… పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని తెలిపారు.  లోయ లోతుగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని… బాదితులు బయటకు రావడానికి వీలు లేకుండా పోయిందని అన్నారు. కారులో ఉన్న నలుగురు మృతిచెందారని తెలిపారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను కారుతో పాటు బయటకు తీశామని అన్నారు.

Latest Updates