కుల్గాంలో ఎన్​కౌంటర్.. నలుగురు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్​లో నలుగురు చనిపోయారని రక్షణ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా మీడియాకు తెలిపారు. సెక్యూరిటీ ఫోర్సెస్ పెట్రోలింగ్ పార్టీపై టెర్రరిస్టులు కాల్పులు జరిపిన తర్వాత మనవాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పారు.

Latest Updates