గుజరాత్‌‌లో కాంగ్రెస్‌‌కు షాక్‌.. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

రాజ్యసభ ఎన్నికల వేళ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా గుజరాత్‌‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. శనివారమే లెటర్లు అందాయని, వారి రాజీనామాలను ఆమోదించానని స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రివేది ఆదివారం ప్రకటించారు. ఆ నలుగురు ఎవరనేది సోమవారం జరిగే అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. దీంతో ఇప్పుడు గుజరాత్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలం 73 నుంచి 69కి పడి పోయింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌‌ మిగతా ఎల్యేలను జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించింది. ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ ముగ్గురు కేండిడేట్లను పోటీకి దించింది. ఆ పార్టీకి ఉన్న బలంతో ఇద్దరు గెలిచే అవకాశాలు ఉండగా.. మూడో వ్యక్తిని కూడా గెలిపించుకోవాలనే వ్యూహంతో ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది.

For More News..

మహిళలకు బ్యాడ్‌న్యూస్.. అభయ హస్తం రద్దు

త్వరలో మిషన్ హైదరాబాద్

మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

గుడ్‌న్యూస్.. కరోనా టెస్టులు ఫ్రీ

కట్నం కోసం కరోనా వేధింపులు

Latest Updates