ఇంటి పైకప్పు కూలి.. ముగ్గురు పిల్లలు, తల్లి మృతి

FILE

బెంగళూరు : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో రామజోగి హళ్లి గ్రామంలో జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. చిన్నారుల తల్లి నాగరత్నమ్మ కూడా ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో.. గ్రామంలో విషాదం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Latest Updates