గ్యాంగ్ రేప్ కు గురైన యువతి మృతి

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు లైంగికదాడి చేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారం క్రితం ఈ దారుణం జరిగింది. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఢిల్లీలోని హాస్పిటల్ లో యువతి చనిపోయింది. నలుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనపై ఢిల్లీలో యూత్ కాంగ్రెస్, భీం ఆర్మీ ఆందోళన చేపట్టాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Latest Updates