ఐస్ క్రీం ఫ్రీగా ఇస్తుంటే తీసుకోలేదని కాల్చిపడేశారు

ఫ్రీగా ఐస్ క్రీం కొనిస్తే తీసుకోలేదని నలుగురు యువకులు మరో యువకుణ్ని తుపాకీతో కాల్చి చంపారు.

ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న లక్ష్య తన స్నేహితులైన కరణ్, ధీరజ్, అవినాష్ లు కలిసి ఇంట్లో పార్టీ చేసుకున్నారు. అనంతరం ఐస్ క్రీమ్ తినేందుకు ఓ షాప్ దగ్గరకు వచ్చారు.

అదే సమయంలో ఓ ఐస్ క్రీమ్ బండి వద్ద అమిత్ శర్మ అతని స్నేహితులు రాహుల్ , ఇషాంత్ లు మాట్లాడుకుంటున్నారు.

మద్యం మత్తులో ఉన్న లక్ష్య స్నేహితులు బాధితుడు శర్మకు ఐస్ క్రీమ్ ను ఫ్రీగా ఆఫర్ చేశారు. ఆ ఆఫర్ ను బాధితుడు అతని స్నేహితులు తిరస్కరించారు. ఆ సందర్భంగా చిన్నపాటి గొడవ జరిగింది. గొడవ అనంతరం లక్ష్య తన స్నేహితుల్ని ఇంటికి తీసుకెళ్లాడు.

కానీ అతని స్నేహితులు  ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇస్తే తీసుకోలేదనే అహంతో వెనక్కి తిరిగి వచ్చారు. అక్కడే ఉన్న శర్మపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల్లో   శర్మ మృతి చెందాడు.

శర్మ మృతిపై అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో సీసీ పుటేజీ లో బైక్ నెంబర్ల ఆధారంగా పోలీసులు., నిందితుల్ని గుర్తించారు.

Latest Updates