క్రికెటర్లకు నాలుగు దశల ట్రెయినింగ్

6 వారాల పాటు ట్రెయినింగ్ టైమ్​!

ఇండియా క్రికెటర్ల కోసం సిద్ధం చేస్తున్నాం

నేషనల్‌ క్యాంప్‌‌కు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వెంటనే గ్రౌండ్‌లోకి
ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌‌. శ్రీధర్‌‌ వెల్లడి
ఆగస్టు–సెప్టెంబర్‌‌లో క్యాంప్!

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు స్తంభించిపోయిన క్రీడా ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. కొన్ని దేశాల్లో ఆటలు తిరిగి మొదలయ్యాయి. ఇండియాలో స్పోర్ట్స్‌‌కు ఇంకా అనుమతి లేకపోయినా ట్రెయినింగ్‌‌మాత్రం షురూ అయింది. టీమిండియా క్రికెటర్ల ట్రెయినింగ్​పై ​బీసీసీఐ ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. అయితే, బెంగళూరులోని ఎన్​సీఏ లేదంటే ధర్మశాల వేదికగా నేషనల్​ క్యాంప్​ నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం. ఆగస్టు–సెప్టెంబర్‌‌మధ్య ఈ క్యాంప్ నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం టీమ్​ మేనేజ్‌‌మెంట్​ ఇప్పటికే కసరత్తులు చేస్తోంది. ట్రెయినింగ్ క్యాంప్‌‌కు గ్రీన్​ సిగ్నల్​ రావడమే ఆలస్యం గ్రౌండ్‌‌లోకి దిగేందుకు సిద్ధమని ఫీల్డింగ్‌‌కోచ్‌‌ఆర్‌‌. శ్రీధర్‌‌అంటున్నాడు. చాన్నాళ్లుగా ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు తిరిగి మ్యాచ్‌‌మూడ్‌‌లోకి వచ్చేందుకు నాలుగు దశల ట్రెయినింగ్‌‌మాడ్యూల్‌‌ప్రిపేర్‌‌చేస్తున్నట్టు వెల్లడించాడు.

నేషనల్‌‌క్యాంప్‌‌కు అనుమతి లభించిన వెంటనే ప్లేయర్ల శిక్షణ ప్రారంభిస్తామని, నాలుగు నుంచి ఆరు వారాల్లోనే ఆటగాళ్లంతా పూర్తిస్థాయి మ్యాచ్‌‌ఫిట్‌‌నెస్‌‌అందుకుంటారని చెప్పాడు. 2014 నుంచి జట్టుతో పాటు ఉంటున్న శ్రీధర్‌‌.. ఆట తిరిగి మొదలైన తర్వాత విరాట్‌‌కోహ్లీ అండ్​ కో ఇంటర్నేషనల్‌‌క్రికెట్‌‌కోసం ఎలాంటి ట్రెయినింగ్‌‌తీసుకుంటారనే విషయంపై మాట్లాడాడు. ‘నాలుగు నుంచి ఆరు వారాల క్యాంప్‌‌లో పాల్గొంటే క్రికెటర్లు మ్యాచ్‌‌కు రెడీ అవుతారు. ఫాస్ట్‌‌బౌలర్లకు ఆరు వారా లు పడుతుంది గానీ.. బ్యాట్స్‌‌మెన్‌‌కాస్త ముందుగానే మ్యాచ్‌‌ఫిట్‌‌నెస్‌‌సాధిస్తారు. ఒకసారి నేషనల్‌‌క్యాంప్‌‌స్టార్ట్‌‌చేసేందుకు బీసీసీఐ డేట్‌‌ఇచ్చి, దానికి గవర్నమెంట్‌‌అప్రూవల్‌‌వచ్చిందంటే మేం మళ్లీ మొదటి నుంచి పని ప్రారంభించొచ్చు. 14 –15 వారాల తర్వాత మళ్లీ గ్రౌండ్‌‌లోకి వస్తున్నప్పుడు ఆటగాళ్లు ఉత్సాహంగా ఉంటారు. కానీ, ఇలాంటప్పుడే వాళ్లను సరైన దశలో నడిపించడం మా ముందున్న సవాల్‌‌. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం సరైన పద్ధతిలో ముందుకుసాగడం ముఖ్యం. కాబట్టి అంతకంటే ఎక్కువ దూరం ఆలోచించాలనుకోవడం లేదు’ అని శ్రీధర్‌‌అభిప్రాయపడ్డాడు.

వర్క్‌‌లోడ్‌‌పై దృష్టి పెట్టాలి..

లాంగ్‌‌బ్రేక్‌‌తర్వాత గ్రౌండ్‌‌లోకి వస్తున్నప్పుడు ప్లేయర్ల వర్క్‌‌లోడ్‌‌మేనేజ్‌‌మెంట్‌‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని శ్రీధర్‌‌అన్నాడు. అతిగా కష్టపడితే గాయాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. కాబట్టి స్టార్టింగ్‌‌లో ప్లేయర్లకు ప్రోగ్రెసివ్‌‌వర్క్‌‌లోడ్‌‌ఇవ్వాల్సిన అవసరం ఉందన్న హైదరాబాద్‌‌మాజీ స్పిన్నర్‌‌… వాళ్ల ట్రెయినింగ్‌‌ఎలా ఉండబోతుందో వివరించాడు. ‘ఫస్ట్‌‌ఫేజ్‌‌లో లో వాల్యూమ్‌‌– లో ఇంటెన్సిటీ (తక్కువ పరిణామం–తక్కువ తీవ్రత)తో ట్రెయినింగ్‌‌ఉంటుంది. ఆపై, మోడరేట్‌‌(మోస్తరు) వాల్యూమ్‌‌–లో ఇంటెన్సిటీ, తర్వాత హై వాల్యూమ్‌‌–మోడరేట్‌‌ఇంటెన్సిటీతో లాస్ట్‌‌ఫేజ్‌‌లో హై వాల్యూమ్‌‌–హై ఇంటెన్సిటీతో ప్రాక్టీస్‌‌చేయిస్తాం.

ఫస్ట్‌‌ఫేజ్‌‌లో ఒక్కో డిపార్ట్‌‌మెంట్‌‌కు ఒక్కోలా శిక్షణ ఉంటుంది. ఈ టైమ్‌‌లో ఫాస్ట్‌‌బౌలర్లు హాఫ్‌‌లేదా క్వార్టర్‌‌రనప్‌‌తో రెండు ఓవర్లు బౌలింగ్‌‌చేస్తుండొచ్చు. డెలివరీలు 20 లేదా 30 శాతం ఇంటెన్సిటీతో ఉంటాయి. ఫీల్డర్లు 40 నుంచి 50 శాతం ఇంటెన్సిటీతో 10 –20 మీటర్ల డిస్టెన్స్‌‌వరకూ మాగ్జిమమ్‌‌ఆరు త్రోస్‌‌విసరుతారు. బ్యాట్స్‌‌మెన్‌‌తొలుత మోడరేట్‌‌పేస్‌‌బౌలింగ్‌‌లో ఐదు నుంచి ఆరు నిమిషాలు బ్యాటింగ్‌‌ప్రాక్టీస్‌‌చేస్తారు. క్యాచెస్‌‌విషయానికొస్తే.. ఫస్ట్‌‌సెమీ–సాఫ్ట్‌‌బాల్స్‌‌తో నెమ్మదిగా స్టార్ట్‌‌చేస్తాం. ఆ తర్వాత ఫేజ్‌‌లు మారేకొద్దీ ఇంటెన్సిటీ పెంచుతాం’ అని శ్రీధర్‌‌చెప్పాడు.

నాలుగో వారం నుంచి మ్యాచ్‌‌ఇంటెన్సిటీతో

నాలుగో వారం నుంచి క్రికెటర్లు మ్యాచ్‌‌ఇంటెన్సిటీతో ట్రెయినింగ్‌‌స్టార్ట్‌‌చేస్తారని, అక్కడి నుంచి నెమ్మదిగా మ్యాచ్‌‌కు రెడీ అయ్యే జోన్‌‌లోకి వస్తారని శ్రీధర్‌‌తెలిపాడు. ‘ముందుగా లో వాల్యూమ్‌‌–లో ఇంటెన్సిటీతో స్టార్ట్‌‌చేస్తాం కాబట్టి ప్రతి రోజూ ఒకే రకమైన శిక్షణ ఉండదు. నాలుగో వారానికి వచ్చాక.. హై వాల్యూమ్‌‌–హై ఇంటెన్సిటీ ట్రెయినింగ్‌‌ప్రారంభిస్తాం.  మ్యాచ్‌‌–ట్రెయినింగ్‌‌మొదలయ్యే  టైమ్‌‌కు బ్యాట్స్‌‌మెన్‌‌140 కి.మీ. వేగంతో వచ్చే బంతులు ఎదుర్కొనేందుకు అలవాటు పడుతారు. షార్ప్‌‌గా ఉండే క్రికెటర్లు ఆరు వారాల్లో టెస్ట్‌‌మ్యాచ్‌‌మూడ్‌‌లోకి వస్తారు.

అయితే,  ఫిజికల్‌‌, మెంటల్‌‌ఫిట్‌‌నెస్‌‌ను బట్టి  ఈ  సమయం ఒక్కో ప్లేయర్‌‌కు ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమందికి 4 వారాలు పడితే, ఇంకొందరికి మరో  మూడు, నాలుగు రోజుల అవసరం అవ్వొచ్చు. కానీ, క్యాంప్‌‌పూర్తయ్యేలోపు ఆటగాళ్లంతా ఫుల్‌‌ఫిట్‌‌నెస్‌‌సాధించేలా చేయాలన్నది, అందరినీ ఒకే జోన్‌‌లోకి తేవాలన్నది మా (కోచ్‌‌ల) లక్ష్యం’ అని  శ్రీధర్‌‌చెప్పుకొచ్చాడు.  బీసీసీఐ కాంట్రాక్టు  క్రికెటర్లంతా టీమ్‌‌స్ట్రెంత్‌‌అండ్‌‌కండీషనింగ్‌‌కోచ్‌‌నిక్‌‌వెబ్‌‌రూపొందించిన ఫిట్‌‌నెస్‌‌ప్రోగ్రామ్‌‌ను ఫాలో అవుతున్నారని తెలిపాడు.

కొత్త  ఐడియాలున్నాయి

ఫీల్డింగ్‌‌కోచ్‌‌గా శ్రీధర్‌‌బాధ్యతలు అందుకున్న తర్వాత టీమిండియా ఫీల్డింగ్‌‌ప్రమాణాలు పెరిగాయి.  వినూత్న పద్ధతుల్లో ఆటగాళ్లతో ఫీల్డింగ్‌‌ప్రాక్టీస్‌‌చేయిస్తూ ఫలితాలు రాబట్టిన శ్రీధర్‌‌తన  మైండ్‌‌లో మరిన్ని కొత్త ఐడియాలు ఉన్నాయని చెప్పాడు.  ‘ఇప్పటికైతే  మేం తిరిగి మైదానంలోకి వెళ్లిన తర్వాత ప్రాక్టీస్‌‌సెషన్స్‌‌ఎలా ప్లాన్‌‌చేయాలని ఆలోచిస్తున్నా.  అలాగే కొన్ని కొత్త టెక్నిక్స్‌‌కూడా నా మైండ్‌‌లో ఉన్నాయి. వాటిపై ఇంకా వర్క్‌‌చేయాలి. ఆ టెక్నిక్స్‌‌ఎలా ఉంటాయో క్యాంప్‌‌మొదలైన తర్వాత  అందరూ చూస్తారు. అయితే,  టాప్‌‌లెవెల్‌‌క్రికెటర్లకు ఏం అవసరమో ఆ దిశగానే  మా ఆలోచనలు ఉంటాయి’ అని శ్రీధర్‌‌పేర్కొన్నాడు.

For More News..

మరో రెండు రోజులు చిరుజల్లులు

ఈజీగా కొత్త అప్పులిస్తున్నస్టేట్​ బ్యాంక్​

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

Latest Updates