అనంతనాగ్ లో ఎన్ కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఇవాళ(ఆదివారం) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్ జిల్లాలోని డయాల్‌ గామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఈ ప్రాంతానికి చేరుకొని వారికోసం గాలింపు చేపట్టాయి. భద్రాతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అలర్టైన భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారా అని తెలుసుకునేందుకు తనిఖీలు చేపట్టాయి.

Latest Updates